calender_icon.png 20 August, 2025 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారంలో రాష్ట్రానికి యూరియా

20-08-2025 02:14:14 PM

హైదరాబాద్ఈ వారంలో తెలంగాణ రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా సరఫరా చేరుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూరియా సరఫరాకు కేంద్రం అమోదం తెలిపిందన్నారు. కర్ణాటక నుంచి 10,000 టన్నుల యూరియా షిప్ మెంట్ ప్రారంభమైందని.. ఈ వారంలో మరో 3 షిప్ మెంట్ల ద్వారా యూరియా సరఫరా అవుతుందని మంత్రి వెల్లడించారు. యూరియా సరఫరా అమోదంతో కాంగ్రెస్ ఎంపీల కృషి ఫలించిందని అన్నారు. కేంద్రం వివక్ష కారణంగానే రాష్ట్రంలోని రైతులకు యూరియా ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి వివరించారు.