23 June, 2026 | 1:05 AM

గతం మరిచిపోయి మాట్లాడొద్దు

23-06-2026 12:19 AM

కాంగ్రెస్ నేతలపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం 

మహబూబ్ నగర్ టౌన్, జూన్ 22 : గతాన్ని మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడకూడదని కాంగ్రెస్ నేతలపై మున్సిపల్ మాజీ చైర్మన్ కొరముని నరసింహులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని సింధు హోటల్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అభివృద్ధి చేయడం మరిచి కేవలం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.

నగరంలో డంపింగ్ యార్డ్ మార్చాలని ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ఇలా అభివృద్ధి పనులకు సంబంధించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలి తప్ప కేవలం ఆరోపణలు చేస్తే అభివృద్ధి జరగదని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడిని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారని సరైన సమయంలో ప్రజల వారికి బుద్ధి చెబుతారని అసహనం వ్యక్తం చేశారు.

నిర్లక్ష్యం అనే మాటకు నిలువుటద్దముల కాంగ్రెస్ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్ని ఆరోపణలు చేసినా ఊరుకున్నామని ఇకనుంచి ఊరుకునే ప్రసక్తి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, కార్పొరేటర్లు ఈశ్వరయ్య, మధు మోహన్,సీనియర్ నాయకులు అనంత రెడ్డి, తాటి గణేష్, జహంగీర్, క్రాంతి, సుధాకర్ ,అబిద్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.