calender_icon.png 16 October, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

40 ఏళ్ల విప్లవానికి విరమణ

16-10-2025 01:35:17 AM

ముగిసిన మావోయిస్టు సరోజ ఉద్యమ ప్రస్థానం 

బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 15 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఉద్యమ బిడ్డ సలాకుల సరోజ విప్లవాద్యమ ప్రస్థానం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ బుధవా రం మహారాష్ట్ర సీఎం ఎదుట 60 మంది మావోయిస్టు బృందంతో ఆయుధాలతో సహా లొంగిపోయారు.

ఈ బృందంలో బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన సలాకుల సరోజ ఉంది. కన్నాలబస్తికి చెందిన అమరు లు, మావోయిస్టు అగ్రనేతలు గజ్జల గంగా రం, కటకం సుదర్శన్‌ల ప్రభావంతో ఆమె విప్లవ రాజకీయాలకు దగ్గరయ్యారు. గజ్జల గంగారాం సోదరి అమరురాలు గజ్జల సరో జ, సలాకుల సరోజ మంచి స్నేహితులు. కాగా ఇద్దరు ఒకే బస్తికి చెందినవారు. విప్లవ కార్యచరణలో మిలిటెంట్‌గా ఇద్దరు కలసి పని చేశారు.

విద్యార్థి దశ నుంచే సరోజ విప్ల వ రాజకీయాలకు ఆకర్షితురాలు అయ్యిం ది.1983 పిన్న వయసులోనే అడ వి బాట పట్టారు. ఇంటి వద్దనే తల్లిదండ్రులు ఆమెకు చిన్న వయసులోనే వివాహం చేశా రు. వివాహం జరిగిన మరుసటి రోజే వ్యక్తిగత జీవితానికి స్వస్తి పలికి సరోజ అజ్ఞాతం లోకి వెళ్లారు. ఈ ఘటన అప్పట్లో సంచల నం సృష్టించింది. నాలుగు దశాబ్దాలు ఉద్య మ ప్రయాణంలో సలాకుల సరోజ దండకారణ్య స్పెషల్ జోనల్ జోన్ కమిటీ, టెక్నికల్ విభాగం సెక్రెటరీ స్థాయికి ఎదిగారు.

పార్టీ లో అంచలంచెలుగా అగ్రశ్రేణి స్థాయికి ఎదిగారు. ఇదే క్రమంలో పార్టీలోనే వివాహం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. 2009లో సలాకుల సరోజ భర్త మోహన్ రెడ్డి, మరో ఇద్దరు మావోయిస్టులతో కలసి ఛత్తీస్ ఘడ్ లో అరెస్టయ్యారు. ఈ సందర్భంలోనే ఆమె పేరు తొలిసారి వెల్లడయింది. కొంతకాలం జైల్లో ఉన్న ఆమె భర్తతో పాటు విడుదలై మళ్లీ మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. అప్ప టి నుంచి వేణుగోపాల్‌తో లొంగిపోయే వరకూ సరోజ ఇంటిదారి పట్టలేదు. 

ఆయుధంతో సరోజ లొంగుపాటు..

40 ఏళ్ల క్రితం అతిపిన్న వయసులో అడవిలోకి వెళ్ళి ఆయుధం పట్టిన సరోజ లొం గిపోతదని ఎవరూ ఊహించలేదు. ముఖ్యం గా ఆమె కుటుంబ సభ్యులు, ఆమె ఆచరణను దగ్గరగా చూసిన మాజీ మావోయిస్టు లు, బస్తీవాసులు అస్సలు ఊహించలేదు. ఆమెతో పాటు అడవి బాట పట్టిన బాల్య స్నేహితురాలు గజ్జల సరోజ విప్లవోద్యమంలోనే అనారోగ్యంతో కన్నుమూశారు.

ఈ నేపథ్యంలో ఆమె లాగే విప్లవ కమిట్మెంట్ ఉన్న సలాకుల సరోజ ఉద్యమాన్ని వీడటంపై స్థానికులు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. అనూహ్యంగా సలాకుల సరోజ ఆయుధంతో లొంగిపోవడం బెల్లంపల్లిలో లొంగు బాటు మావోయిస్టుల చరిత్రలో తొలి ఘటనగా చర్చించుకుంటున్నారు. అనూహ్యంగా సరోజ సరెండర్ తో ఒకసారిగా ఊపిరి పీల్చుకున్నారు.