6 July, 2026 | 3:38 PM

Breaking News

శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •  

రంజాన్ కిట్‌లు అందరికీ అందాలి

20-03-2026 12:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, మార్చి 19(విజయక్రాంతి): ప్రభుత్వం పేద ముస్లింలకు  అంద జేసే రంజాన్ కిట్‌లు ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి  అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ డిమాండ్ చేశారు. గురువారం భోలక్ పూర్ లో ప్రసిద్ధిగాంచిన బడి మసీదు వద్ద ప్రభుత్వం అందజేసే రంజాన్ కిట్లను ఎమ్మెల్యే ముఠా గోపాల్ బడి మసీదు ముత్తవల్లి నజీర్ అలీ, ముషీరాబాద్ డిఐ నదిముద్దీన్ లతో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మసీదుకు 250 రంజాన్ కిట్లను ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ స్థానికంగా పేద కుటుంబాలకు చెందిన ముస్లిం లు అధికంగా నివసిస్తున్నందున అందరికీ రంజాన్ కిట్లు అందడం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని పేర్కొన్నారు. రంజాన్ పండుగను ప్రజలంతా ఐక్యంగా జరుపుకొని మతసామరస్యాన్ని కాపాడాలన్నారు.

ఈ సందర్భంగా బడి మజీద్ ముత్తవల్లి ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితర అతిధులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువనాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, పార్టీ సీనియర్ నాయకులు రహీం, డివిజన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ పార్టీ నాయకులు జబ్బార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.