18 July, 2026 | 3:59 AM

గట్టిగానే భయపెట్టారట!

02-12-2024 01:49 AM

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది మీనాక్షి చౌదరి. ఇటీవల ఆమెను వరుసగా అవకాశాలు పలకరిస్తున్నాయి. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ‘లక్కీ భాస్కర్’లో కథానాయకుడు దుల్కర్ సల్మాన్‌కు భార్యగా, ఒక బిడ్డకు తల్లిగా నటించి ఆశ్చర్యపరిచింది మీనాక్షి. తన కెరీర్‌లోనే ద బెస్ట్‌గా నిలిచిపోయే ఈ చిత్రంలో నటించడం సంతోషాన్నిచ్చిందని చెప్తూనే ఇందులో తాను పోషించిన పాత్రే అస్సలు నచ్చలేదంటోందీ ముద్దుగుమ్మ.

ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టిం ది మీనాక్షి. “లక్కీ భాస్కర్’తో నాకు ప్రశంసలు లభించినా, కొందరు స్నేహితులు భయపెడుతున్నారు. కెరీర్ ప్రారంభిం చిన దశలోనే ఇలాంటి పాత్రల్లో నటించకపోవడం ఉత్తమమని సూలహా ఇచ్చారు. అలాంటి పాత్రలకు ఇంకా చాలా టైమ్ ఉందని సూచించారు. ఇలాంటి పాత్రలు చేస్తూ పోతే.. త్వరలోనే నిన్ను అక్క, అమ్మ పాత్రలకు పరిమితం చేస్తారంటూ గట్టిగానే భయపెట్టారు. అందుకే ఇకపై నేను హీరోకు భార్యగా, బిడ్డకు తల్లిగా నటించే పాత్రల్లో నటించొద్దని నిర్ణయించుకున్నా. యాక్షన్‌తో కూడిన కమర్షియల్ కథా చిత్రాల్లో నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నా.