13 May, 2026 | 8:21 AM

ధాన్యం రాశులను పరిశీలించిన మండల ఏ పీ యమ్

11-12-2024 05:19 PM

అనంతగిరి: మండల పరిధిలోని వాయిల సింగవరం గ్రామంలో బుధవారం ధాన్యం రాశులను అనంతగిరి మండల మహిళా సమాఖ్య ఏ పీ యమ్ లక్ష్మీ పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ.. త్వరితగతిన కాంటాలు వేయాలని సూచించారు. ధాన్యాన్ని ఎండబెట్టి తూరుపాల పోసి ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర, బోనస్ పొందాలని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో సీసీ యేసు ఏఈవో అన్వేష్ రాజా, ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.