calender_icon.png 29 May, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ అభివృద్ధికే మండల కమిటీలు

28-05-2025 01:26:36 AM

కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు

మెదక్, మే 27(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకే మండలాల కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఫిషరిస్ చైర్మెన్, కమిటీ అబ్జర్వర్ మెట్టు సాయికుమార్, జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ ల సమక్షంలో వివిధ మండలాలకు సంబంధించిన కమిటీ నాయకుల పేర్ల జాబితాను అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు బొజ్జ పవన్, సుప్రబాతరావు, బ్లాక్ కాంగ్రెస్ మెదక్ అధ్యక్షులు హపీజ్ మోల్సాబ్, రమేశ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ మేడి మధుసూదన్ రావు, తాజా మాజీ కౌన్సిలర్ లు దుర్గప్రసాద్,

లింగం, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రబాకర్ రెడ్డి, పాపన్నపేట మండల పార్టీ అధ్యక్షులు గోవింద్, శంకర్, హావేలి ఘణపురం మండల అధ్యక్షులు లక్కరు శ్రీనివాస్, అశోక్ రెడ్డి, ఉమర్, మైసన్, మన్సూర్, బానీ, రాగి అశోక్, శివ రామక్రిష్ణ, అమరసేనా రెడ్డి, హరిత, స్వరూప, ఆరీప్, నాగరాజు పాల్గొన్నారు.