calender_icon.png 29 May, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

28-05-2025 01:27:53 AM

పటాన్ చెరు, మే 27 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని మంగళవారం ఉదయం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గంలోని తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు స్వామివారిని దర్శించుకున్నారు.