మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన శివరాంరెడ్డి
07-07-2026 12:40 AM
మాగనూరు జులై 6: నూతన మాగనూరు మండల అధ్యక్షుడు శివరాం రెడ్డి సోమవారం హైదరాబాదులో మంత్రి చాంబర్లో డాక్టర్ వాకిటి శ్రీహరిని కలిసి బుక్కెను అందించి శాలువతో మంత్రి నీ సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాగనూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను ,కార్యకర్తలను, కలుపుకొని సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా శివరాం రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీ హరి గారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి, ఆనంద్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమూర్తి, వాకిటి శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి మౌలాలి, రాఘవరెడ్డి, రామచంద్ర గౌడ్,, తదితరులు పాల్గొన్నారు.






