11 August, 2026 | 2:03 AM

మండల కమిటీలు ఆగస్టు 15వరకు పూర్తి చేయాలి

11-08-2026 12:00 AM

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తూములూరి నరసింహారావు

కూసుమంచి, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టి మండల పార్టి కమిటీలు ఆగష్టు15 లోపు పూర్తి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టి ఉపాధ్యక్షుడు తూములూరి.నరసింహరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్యాంపు కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి. శ్రీనివాస రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టి అధ్యక్షుడు బజ్జురి.వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టి ఆదేశాల మేరకు కేటాయించిన రిజర్వేషన్ల తో పాటు 30 శాతం మహిళా కోటాను ఉపయోగించి 21 మంది సభ్యులతో మండల కమిటీ పూర్తి చేసి ఆగష్టు 15 వరకు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో  జిల్లాపార్టి ఉపాధ్యక్షుడు మంకేన వాసు, ప్రధాన కార్యదర్శి, ఎండి.హఫీజుద్దీన్, కార్యదర్శి గొల్లపూడి.వీరన్న తదితరులు పాల్గొన్నారు.