calender_icon.png 21 January, 2026 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లి పంచాయతీని సందర్శించిన ఎంపీ వద్దిరాజు

21-01-2026 08:29:45 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి గ్రామపంచాయతీ  కార్యాలయాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బుధవారం సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొత్తగూడెం నుంచి ఇల్లందు వెళ్తూ మార్గ మధ్యలోని టేకులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి నూతనంగా ఎన్నికైన టేకులపల్లి  గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ బాలు నాయక్ ను  అభినందించారు. సర్పంచ్ కోరిక మేరకు గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు రూ. 25 లక్షలు  గ్రాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నిధులు తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి కొరకు ఈ గ్రాంటున్న కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా టేకులపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గంకు  ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడ బాలు నాయక్ తో పాటు ఉప సర్పంచ్ అనంతుల వసంత, బీఆర్ ఎస్ నాయకులూ లక్కినేని సురేందర్ రావు, భూక్యా దళ్ సింగ్ నాయక్, డిండిగాల రాజేందర్, భూక్యా లాలూ, అప్పారావు, బానోత్ రామ, సర్పంచ్ రామ, రేణుక తదితరులు పాల్గొన్నారు.