మంత్రి పొంగులేటిని కలిసిన మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి
కూసుమంచి, మే 10(విజయక్రాంతి): కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచి నాకు అధ్యక్షుడు పదవి ఎంపిక చేసిన మంత్రి కి బజ్జూరి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, సిడిసి చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీను నాయక్, సర్పంచులు బానోతు నాగేశ్వరరావు, నీలకంఠం, ఏఎంసీ డైరెక్టర్ కంచర్ల సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, జర్పుల శ్రీను నాయక్ ,ఇందుర్తి వెంకటరెడ్డి, పుల్లారెడ్డి పాల్గొనడం జరిగింది.






