13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

31-03-2026 05:14 PM

మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి

మంగపేట,(విజయక్రాంతి): పెట్రోల్ బంక్ నిర్వాహకులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి బంక్ నిర్వాహకులకు సూచించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని పెట్రోల్ బంక్ నిర్వాహకులతో మంగళవారం మంగపేట పోలీస్ స్టేషన్ లో మంగపేట సెకండ్ ఎస్సై శ్రీకాంత్ తో కలిసి ఎస్సై టీ.వీ.ఆర్.సూరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై టీ.వీ.ఆర్.సూరి మాట్లాడుతూ బంక్ నిర్వాహకులు వినియోగదారులకు నిబంధనల ప్రకారం సేవలు అందించాలన్నారు.

పెట్రోల్ బంక్ పరిసరాలు పూర్తిగా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మైనర్లకు బంకులలో పెట్రోల్ ఫిల్లింగ్ చేయకూడదని తెలిపారు. వాహనాలలో మాత్రమే పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ చేయాలని, బాటిల్స్, డ్రమ్ములలో, ట్యాంకర్లలో ఫిల్లింగ్ చేయకూడదని, ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఫిల్లింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల ముందు లారీ, ఇతర వాహనాలను పార్కింగ్ చేయకూడదని,

పెట్రోల్ బంకుల ముందు వాహనాలు పార్కింగ్ చేయడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని,  వాహనాల నిలిపితే వాహనదారులతో పాటు బంక్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు వినియోగదారులకు త్రాగునీరు సౌకర్యం, ఎయిర్ సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో మంగపేట ఎస్సై టీ.వీ.ఆర్.సూరి, మంగపేట సెకండ్ ఎస్సై శ్రీకాంత్, మండలంలోని  బంక్ నిర్వాహకులు పాల్గొన్నారు.