6 July, 2026 | 1:52 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

మణిమహేశ్ యాత్ర ప్రారంభం

28-08-2024 02:54 AM

హిమాచల్‌ప్రదేశ్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మణిమహేశ్ యాత్ర మొదలైంది. హిమాచల్‌లోని మణిమహేశ్ సరస్సును సందర్శించేందుకు ఈ యాత్రను చేపడుతారు. సాధారణంగా ఈ కాలంలోనే దాన్ని సందర్శించేందుకు అనువైన సమయంగా పేర్కొంటారు. హిమాచల్‌లో దాల్ సరస్సునే మణిమహేశ్ (మహాశివుడు) అని పిలుస్తారు. ఏటా జన్మాష్టమి అనంతరం మణిమహేశ్ సరస్సును చూసేందుకు యాత్రికులు తరలి వస్తునంటారు. ఈ యాత్ర రాధా జన్మాష్టమి(సెప్టెంబర్ 11)కి ముగిస్తుంది. కైలాస పర్వతంపై ఉండే మహాశివుడు దాల్ సరస్సు నుంచి అద్భుతంగా కనిపిస్తాడని నమ్ముతారు. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందిన రాజు సాహిల్ వర్మ ఇక్కడే శివున్ని దర్శనం చేసుకున్నాడని, అప్పటి నుంచి ఈ యాత్ర ప్రారంభమైనట్లు తెలుస్తోంది.