12 April, 2026 | 7:45 PM

చేతులు కలిపి ఉట్టిని కొట్టి

28-08-2024 02:55 AM

ముంబై, ఆగస్టు 27: మహారాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా ముంబై ఇందుకు ప్రధాన వేదిక. ప్రతి వీధిలో ఉట్టికొట్టే కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ దహీ హండీగా పిలుస్తారు. ఐదారు అంతస్తుల ఎత్తులో ఉట్టిని కట్టి దాన్ని పగలకొట్టేందు కు మానవ పిరమిడ్లుగా ఏర్పడుతారు. ఇది చూసేందుకు భయం అనిపించినా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. చాలామంది ఔత్సాహికులు, యువతీయువకులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ చిత్రం ముంబైలోని దాదర్‌లో తీసింది.