calender_icon.png 7 December, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంటకాల్లో మంథని స్టైలే వేరు!

19-10-2025 12:45:08 AM

గోదావరి తీరంలో పండుగలైనా, పితృకార్యాలైనా, నిత్య భోజనమైనా.. వంటింట్లో తులసి వాసన, నెయ్యి పరిమళం, దాల్చిన చెక్క మసాలా ఘుమఘుమలతో వంట రుచులు పండుతుంటాయి. ఈ ప్రాంతంలోని బ్రాహ్మణుల వంటకాల రుచి, రీతీ, నీతీ కలయికగా ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. అందుకే ఇక్కడి ప్రతి ఇల్లు ఒక పాకశాలగా ప్రాచుర్యం పొందాయి.

మోతిచూర్ లడ్డూ

ఇక్కడి స్పెషల్ ‘మోతిచూర్ లడ్డూ ‘దివాళీకి కే కాదు ప్రతి శుభకార్యంలో అతిథులు ఈ లడ్డు కోసం ఎగబడుతారు. దీపావళి అనగానే కొత్త దుస్తులు, బాణసంచా మోతలే కాదు.. నోరూరించే స్వీట్స్ కూడా ఉంటాయి. ఇవి తినడమే కాదు.. బంధువులకు, అతిథులకు గిఫ్ట్‌లుగా కూడా ఇస్తుంటారు. అయితే దీపావళి స్వీట్స్ అనగానే లిస్ట్‌లో మైసూర్‌పాక్, బాదుషా, తొక్కుడు లడ్డూలు, మోతీచూర్ లడ్డూలు ఇలా ఎన్నో ఉంటాయి.

ఎన్ని ఉన్నా అందరీ ఫేవరెట్  మోతిచూర్ లడ్డూ. దీని టేస్ట్ మరేదానికి రాదు. అందుకే చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే.. బయట స్వీట్ షాప్స్‌లలో లభించే ఈ లడ్డూలో కల్తీ జరిగే అవకాశం ఉంటుందని  చాలా మంది మంథని నుండి తెప్పించుకుంటుంటారు.