వినియోగదారుల ఫోరం ద్వారా నాణ్యమైన సేవలు రావాలి
మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత ఎన్.రామచంద్ర రావు...
ముషీరాబాద్ (విజయక్రాంతి): వినియోగదారుల ఫోరం ద్వారా నాణ్యమైన సేవలు రావాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత ఎన్.రామచందర్ రావు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా వినియోగదారుల కేసులు ఆస్రా ద్వారా పరిష్కారించడం హర్షణీయం అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబీలీటీ (ఆస్రా) ఆధ్వర్యంలో ఈనెల 15న బెంగుళూరులో జరిగే 6వ జాతీయ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ముఖ్య అతిథిగా హాజరై ఆస్రా వ్యవస్థాపక అధ్యక్షులు హబీబ్ సుల్తాన్ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం వారి హక్కులకు భంగం వాటిల్లిన్నప్పుడు ఉచితంగా న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఆస్రా ఏర్పిడిందన్నారు.
ఆస్రా ఫౌండర్ హబీబ్ మాట్లాడుతూ.. సంస్థ 2016లో ప్రారంభమై 12 రాష్ట్రాల్లో 1000 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నారని, ఆస్రా సంస్థ ప్రతి సంవత్సరం ఆస్రా నేషనల్ సమ్మిట్ నిర్వహిస్తుందన్నారు. డిసెంబర్ 15న 6వ జాతీయ సదస్సు బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఫౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి మునియప్ప, ఐఏఎస్ విజయ్ జోష్న తదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్రా తెలంగాణ అధ్యక్షులు వెంకటేష్ గుప్త, ప్రతినిధులు కీర్తి, సుమన్, ఖైలేష్, ప్రశాంత్, శిరీష పాల్గొన్నారు.






