టిఎంయు అధ్యక్షులుగా మార్గొండ రాము
08-06-2026 05:11 PM
నిర్మల్,(విజయక్రాంతి): పీజీ ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర మజ్దూర్ యూనియన్ నిర్మల్ డిపో గౌరవాధ్యక్షులుగా మార్గొండ రామును సోమవారం ఎన్నుకున్నారు. డిపో కార్యాలయంలో నూతన కమిటీని పరిచయం చేసుకొని అధ్యక్షునిగా ఆయన రెండోసారి ఎన్నుకున్నట్టు పీఎం నాయకులు గంగాధర్ నారాయణ తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసి నాయకులు రమణ శంకర్ రాంప్రసాద్ అశ్విని తదితరున్నారు.






