21-01-2026 12:14:16 PM
వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామం మార్కండేయ ఆలయ కమిటీ చైర్మన్ గుండెల్లి రాజు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మార్కండేయ మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పూజారి దూస రాజేశం పూజా విధులను నిర్వర్తించారు.
వారు మాట్లాడుతూ... మార్కండేయ మహర్షి జీవితంఆదర్శప్రాయమని, ఆయన బోధనలు యువతకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.గ్రామంలోని పద్మశాలి సంఘం అధ్యక్షుడు మాడూరి రాములు ఉపాధ్యక్షులు వాసాల మహేందర్ సంఘ సభ్యులు సత్యనారాయణ రవి వార్డ్ మెంబర్ శ్రీనివాస్ ధ్యానపల్లి రవి రాజేంద్రప్రసాద్ యువత భారీ సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు.