calender_icon.png 24 July, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహిత అదృశ్యం..

23-07-2025 05:35:54 PM

మేడిపల్లి: భర్తతో గొడవపడి వివాహిత అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేమాని వెంకన్న, నేమాని పల్లవి(22)లకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరిది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు గ్రామం. వీరు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పి అండ్ టి కాలనీలో భర్త, భార్య, పిల్లలు  కలిసి నివాసం ఉంటున్నారు.

గత కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుండడంతో ఈనెల 21న ఉదయం, 07:30 గంటల సమయంలో పల్లవి పనికి వెళ్తున్నానని చెప్పి తన వస్తువులు బ్యాగులో వేసుకొని పిల్లలను ఇంటివద్దె వదిలి వెళ్ళిపోయింది. ఇప్పటికీ తిరిగి రాలేదు, భర్త పలు ప్రాంతాలలో వెతికిన ఆచూకీ తెలియలేదని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మహిళ ఆచూకీ తెలుస్తే ఈ  నెంబర్ 8712662702 కు సమాచారం ఇవ్వాలని మేడిపల్లి సిఐ గోవింద రెడ్డి(CI Govinda Reddy) తెలియజేశారు.