23-07-2025 05:31:50 PM
మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎండీ. యాకుబ్ పాషా..
కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మసీదుల్లో సేవలందిస్తున్న ఇమాం, మౌజన్‌ల గౌరవ వేతనం కొనసాగించేందుకు వారు తమ దృవీకరణ పత్రాలను ఈ నెల 31వ తేదీలోపు సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా(Minority Welfare Association President MD. Yakub Pasha) బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆదాయ దృవీకరణ పత్రం, మసీదు కమిటీ నుంచి సర్వీస్ సర్టిఫికెట్ పత్రాలను ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోని వక్ఫ్ బోర్డు అధికారికి అందజేయాలని సూచించారు. పత్రాలు సమర్పించని యెడల గౌరవ వేతనాలు రద్దయ్యే అవకాశం ఉందని యాకూబ్ పాషా హెచ్చరించారు. మరిన్ని వివరాల కోసం 8520860785 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.