23-07-2025 05:37:43 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని పెద్ద ముబారక్ పూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం నాడు పుస్తకాలు, పెన్నులను, స్కూల్ బ్యాగులు ఎంఈవో నాగారం శ్రీనివాస్(MEO Nagaram Srinivas) పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంఈవో మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన జనవాడ రాజు పాఠశాల అభివృద్ధికి, పేద పిల్లలకు విద్యా సామాగ్రిని అందించడం అభినందనీయమని కొనియాడారు. విద్యాభివృద్ధికి దాతల సాకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ స్వప్న మధు, యువకులు పాల్గొన్నారు.