15 March, 2026 | 11:17 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

చీమల భయంతో వివాహిత ఆత్మహత్య

07-11-2025 12:00 AM

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఘటన

‘చీమలతో బతకడం నావల్ల కావట్లేదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం

అమీన్‌పూర్, నవంబర్ 6: చీమల భయంతో ఓ వివాహిత ఆత్మహత్య చే సుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పరిధిలోని నవ్య హోమ్స్‌లో జరిగింది. 2022లో మంచిర్యాలకు చెందిన చిందం శ్రీకాంత్‌తో ద్యావనపెళ్లి మనీషా(25)కు వివాహం జరిగింది. వారికి ఒక కూతురు ఉన్నది. రెడున్నర సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా దంపతులిద్దరూ అమీన్‌పూర్‌కి వచ్చి నవ్య హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.

అయితే మనీషాకి చిన్నప్పటి నుంచి చీమలు అంటే భయం. వైద్య శాస్త్ర ప్రకారం మైర్మేకో ఫోబియాతో బాధపడుతున్న ట్టు తెలిసింది. ఈ క్రమంలోనే  మంగళవారం భర్త డ్యూటీకి వెళ్లిన అనంతరం ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు లోపలి నుండి గడి పెట్టి ఉన్నది. స్థానికుల సహాయం తో తలుపులు బద్దలుకొట్టి చూడగా మనీషా ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది.

ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించగా సూసైడ్ నోట్ లభించింది. అందులో “శ్రీ ఐయాం సారీ. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు. కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చండి” అని రాసి ఉంది. ఈ సూసైడ్ నోట్ ఆమె ఫోబియా తీవ్రతను, మానసిక భను తెలియజేస్తుందని పోలీసులు తెలి పారు. అమీన్ పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.