14 June, 2026 | 2:27 AM

ప్రియుడితో కలిసి వివాహిత ఆత్మహత్య

14-06-2026 12:54 AM
  1. ప్రియుడితో చాటింగ్.. మందలించిన భర్త
  2. మనస్తాపంతో ఉరేసుకుని బలవన్మరణం
  3. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన

కొల్లాపూర్ రూరల్, జూన్ 13: నాగర్‌కర్నూల్ జిల్లా ఏల్లూరులో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన మాజీ ప్రియుడితో చాటింగ్ చేస్తూ భర్త కంట పడింది. మందలించాడని పుట్టింటికి వెళ్లిన వివాహిత ప్రియుడితో కలిసి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  ఏల్లూరుకు చెందిన రేణుక (20)కు శివ (౨౫)తో పెళ్లికి ముందు ప్రేమాయణంలో ఉన్నారు. కానీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. రేణుకకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారు. వారికి ఒక కుమార్తె.

ఇటీవల ప్రియుడితో చాటింగ్ చేస్తున్న విషయం తెలిసి రేణుకను భర్త మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన రేణుక కూతురుతో కలిసి పుట్టింటికి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి రేణుక కనిపించకుండా పోయింది. కుటుం బ సభ్యులు చుట్టు పక్కల వెతికారు. శనివారం ఉదయం గ్రామ శివారులోని ఓ మామిడి తోటలో రేణుక, శివ ఇద్దరూ చెట్టుకు ఉరేసుకుని విగత జీవులుగా కనిపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు కొల్లాపూర్ ఎస్సై బండారు సురేష్ తెలిపారు.