వర్క్ ఫ్రం హోమ్ పేరుతో మోసం
14-06-2026 12:57 AM
- బీటెక్ విద్యార్థి బలవన్మరణం
- సిద్దిపేట జిల్లా గూడెం గ్రామంలో ఘటన
బెజ్జంకి, జూన్ 13(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామంలో హృద య విదారక ఘటన చోటుచేసుకుంది. వర్క్ ఫ్రం హోమ్ పేరుతో జరిగిన ఆన్‌లైన్ మోసానికి గురైన ఓ బీటెక్ విద్యార్థి తీవ్ర మన స్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గూడెం గ్రామానికి చెందిన రోషన్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
ఇటీవల అతని మొబైల్ ఫోన్‌కు వర్క్ ఫ్రంహోమ్ సందేశాన్ని నమ్మి, విడతల వారీ గా రూ.30వేల వరకు ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం నిర్వాహకులు స్పందించ లేదు. ఫోన్ నంబర్లు అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్లు రోషన్ గ్రహించి, గురువారం రాత్రి గూడెంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.






