వరుణ్ మోటార్స్ షోరూమ్‌ల్లో మారుతి ఎపిక్ కొత్త స్విఫ్ట్
11-05-2024 12:56 AM
ముంబై, మే 10: మారుతి సుజుకి తాజా గా విడుదల చేసిన కొత్త స్విఫ్ట్ మోడల్ ఎపిక్‌ను హైదరాబాద్‌లో వరుణ్ మోటార్స్ షోరూమ్‌లో ఆవిష్కరించారు. సంస్థ బేగంపేట, కొంపల్లి షోరూమ్‌ల్లో ఈ మోడల్‌ను ప్రదర్శించారు. బేగంపేట షోరూమ్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్లేబ్యాక్ సింగర్ స్మిత, కొంపల్లి షోరూమ్‌కు సినీనటి హెబ్బా పటేల్ ముఖ్య అతిధులుగా హాజరై కొత్త కారును ఆవిష్కరించి తొలి కస్టమర్లకు అందించినట్టు వరుణ్ మోటార్స్ తెలిపింది. ఈ కార్యక్రమంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ వి.ప్రభు కిషోర్, ఎండీ వరుణ్‌దేవ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌సీ రాజు తదితరులు హాజరయ్యారు.






