calender_icon.png 9 November, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

16న నాంపల్లి గ్రౌండ్‌లో సామూహిక భగవద్గీత పారాయణం

09-11-2025 12:37:50 AM

తెలంగాణ సనాతన ధర్మ ప్రచార సమితి (రి)

ఖైరతాబాద్; నవంబర్ 8 (విజయక్రాంతి): కోటి మందికి భగవద్గీత జ్ఞానాన్ని అందించాలనే సత్ సంకల్పంతో ఈనెల 16న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో పదివేల 116 మందితో సామూహిక భగవద్గీత పారాయణం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సనాతన ధర్మ ప్రచార సమితి (రి) అధ్యక్షులు మంథని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేర కు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్  ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో లలిత పీఠం సంపూర్ణానంద స్వామి, సమితి ఉపాధ్యక్షులు వేణుగోపాల్,  మోహన్ రావు తది తరులతో కలిసి ఎందుకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు.

అనంతరం వా రు మాట్లాడుతూ .. ఈనాటి ప్రపంచ మానవులందరికీ దారిద్రం, దుఃఖం, అనారోగ్యం, కష్ట నష్టాలు సమస్త సమస్యలను తీర్చగలిగే ఏకైక దైవ గ్రంధం భగవద్గీత అని తెలిపారు. సనాతన ధర్మం సకల ఐశ్వర్యాలకు, మోక్షానికి మార్గం అనే నినాదంతో సనాతన ధర్మ సమితి గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా 50 వేల మంది కి పైగా గీత జ్ఞానాన్ని అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఐఏఎస్ పరికిపండ్ల నరహరి, మాజీ డిజిపి అరవిందరావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతరని తెలిపారు.