12 April, 2026 | 7:36 AM

శ్వేతలక్ష్మీ వారాహి ఆలయంలో సామూహిక కుంకుమార్చన

01-10-2025 12:58 AM

రేగొండ సెప్టెంబర్ 30(విజయక్రాంతి): దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని శ్వేత లక్ష్మీ వారాహి ఆలయంలో ఉపాసకులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం సామూహిక కుంకు మార్చన కార్యక్రమం నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు మహా గౌరీ స్వరూపంలో దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో  కుంకుమార్చన లో పాల్గొని పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిదర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ, మాజీ ఎంపీటీసీ మైస సుమలత, భవాని మాల ధారణ స్వాములు పాల్గొన్నారు.