calender_icon.png 1 October, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్క పిల్లను ఎత్తుకొని తిరుగుతున్న వానరం

01-10-2025 12:59:20 AM

జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి లో ఘటన

రేగొండ సెప్టెంబర్ 30(విజయక్రాంతి): మండలంలోని తిరుమలగిరి గ్రామంలో వింత ఘటన మంగళవారం జరిగింది. ఓ వానరం అప్పుడే పుట్టిన చిన్న కుక్క పిల్లను ఎత్తుకొని చెట్లపై తిరుగుతుంది. స్థానికులు ఎంత ప్రయత్నించినా కుక్క పిల్లను విడవకుండా కింద పడకుండా గట్టిగా పట్టుకుని ఓ చెట్టు పైనుండి మరో చెట్టు పైకి దునుకుతూ స్థానికుల పైకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుందే తప్ప కుక్క పిల్లను విడవడం లేదు.

పాపం తల్లి కుక్క ఆ వానరం వెనకాలే పరిగెడుతుంది. కానీ ఆ వానరం మాత్రం జాలి దయ లేకుండా ఆ కుక్క పిల్లను తన పొట్టకు గట్టిగా హత్తుకొని అక్కడినుండి వెళ్ళిపోయింది.