18 July, 2026 | 1:59 AM

సామూహిక కుంకుమార్చన

18-07-2026 01:59 AM

నిజామాబాద్, జూలై 17 (విజయక్రాంతి):ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో  వారాహి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పురోహి తులు వేదమంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించగా మ హిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు డా. మద్దుకురి సాయిబాబు మా ట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తమ సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.