25 July, 2026 | 11:20 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలు

05-11-2025 03:21 PM

పెద్ద ఎత్తున పాల్గొన్న దంపతులు.. భక్తులు..

సుల్తానాబాద్,(విజయక్రాంతి): సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వేడుకల ను వైభవంగా నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోనిఅయిత రాజుపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం సామూహిక సత్యనారాయణ వ్రతం  కార్యక్రమాన్ని దంపతులచే ఘనంగా  నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు.  ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ దీకొండ భూమేష్ కుమార్ , ఆలయ అర్చకులు నాగేంద్ర చార్యులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.