calender_icon.png 6 August, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలిపై సామూహిక లైంగిక దాడి

21-09-2024 01:35:48 AM

మేడ్చల్, సెప్టెంబర్ 20: తాగిన మైకంలో వృద్ధురాలి (65)పై ముగ్గు రు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. బండ మాదారం గ్రామంలో గురువారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లో ముగ్గురు మద్యం తాగారు. అనంతరం మత్తులో ఆమెపై లైంగిక దాడి చేశారు. విషయం శుక్రవారం వెలుగులోకి రాగా గ్రామస్థులు నిం దితుల్లో ఒకరిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పో లీసులు గ్రామానికి వెళ్లి బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేసుకొని, చికిత్స నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకట్ రావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని వివరాలు సేకరించారు.