18 March, 2026 | 4:23 PM

కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు

18-03-2026 02:51 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి పతంలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో గల ప్రాథమిక పశువైద్య కేంద్రంలో యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మండల పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో గల 12 కుక్కలకు టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా గోపాల్పేట్ గ్రామంలో  పాద-ముక వ్యాధి టీకా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందన్నారు.

పాద-ముఖ కార్యక్రమంలో 65 పశువులకు,112 ఎద్దులకు/మేతపశువులకు టీకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి రవికుమార్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్ శాలువతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్, సిబ్బంది జయరాజ్, గంగారాం, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.