18 March, 2026 | 5:59 PM

వాసవిలో ముందస్తుగా ఉగాది వేడుకలు

18-03-2026 02:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాలలో వాసవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఉగాది పండుగను ఉపాధ్యాయులు  విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. తీపి, పులుపు ,కారం, చేదు, ఉప్పు, వగరు ఈ షడ్రుచులతో పచ్చడి తయారు చేసి అందరికి పంచారు. ఈ ఆరు రుచులు మన జీవితంలో వచ్చే వివిధ అనుభవాలను సూచిస్తాయి. విద్యార్థులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి విద్యాసంస్థల కరాస్పాండెంట్ శ్రీ. పోతారెడ్డి గారు, ప్రిన్సిపాల్ M.రాజ్ కుమార్ గారు, , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.