18 March, 2026 | 4:23 PM

వెంపటిలో వీధికి మట్టి పనితో బురద కష్టాలకు చెక్

18-03-2026 02:55 PM

 సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య చొరవ పట్ల గ్రామస్తుల హర్షం

తుంగతుర్తి,(విజయక్రాంతి): గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన, ప్రజా ప్రతినిధులు, అధికారులు వస్తూ వెళ్తున్న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి ఓ వీధిలో ఎల్లకాలం బురదమయంగా ఉండి, వర్షాకాలంలో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. వెంపటి 8,9వ వార్డుల వీధి వర్షం పడితే దయనీయ పరిస్థితులు నెలకొని, చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావడం కూడా కష్టమయ్యేది.

దీనితో దోమలు వృద్ధి చెంది, రోగాల బారిన  పడ్డారు. ఈ సమస్యను గుర్తించిన నూతన సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, ఉప సర్పంచ్ దాసరి మంజుల రామచంద్రు, వార్డు సభ్యురాలు దేశబోయిన కేతమ్మ స్పందించి, బురదతో నిండిన వీధిలో మట్టి పోయించే, డోజర్ తో చదును పనులను శ్రీకారం చుట్టారు. దీంతో వీధి పరిస్థితి గణనీయంగా మెరుగుపడి, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గడిచిన ప్రభుత్వాలు రోడ్డు మరమ్మత్తుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడినట్లు జోరుగా విమర్శలు వెళ్లివెత్తినాయి.

ఈ సమస్యను తక్షణమే గుర్తించిన సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు ఐకమత్యంతో కలిసి, అభివృద్ధికి బాటలు వేయడంతో  వీధి వాసులు సర్పంచ్, వార్డు సభ్యురాలికి గ్రామస్తులు వీధివాసులు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తమ సమస్యను పరిష్కరించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పట్ల చొరవ చూపిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు రాజకీయాలకతీతంగా ముందు ముందు, అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని, యువత గ్రామస్తులు మేధావులు కోరుతూ అభినందనలు తెలిపారు.