6 July, 2026 | 3:59 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

హుస్నాబాద్‌లో కిసాన్ మేళాకు భారీ ఏర్పాట్లు

05-06-2025 12:00 AM

మంత్రుల రాకతో భద్రతపై పోలీసుల ప్రత్యేక దృష్టి

హుస్నాబాద్, జూన్ 4 : ఈ నెల 6, 7, 8 తేదీలలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో జరగనున్న కిసాన్ మేళాకు అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ మేళాకు మంత్రులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. బుధవారం హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్, ఎస్త్స్ర మహేశ్ మేళా ప్రాంగణాన్ని సందర్శించి, ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ, ‘కిసాన్ మేళా సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. మేళాకు వచ్చే రైతులు  ప్రజలు పోలీసుల సలహాలు, సూచనలను తప్పకుండా పాటించాలి‘ అని విజ్ఞప్తి చేశారు.

అధికారులు ముఖ్యంగా వీఐపీల రాకపోకలు, రైతులు కూర్చునే గ్యాలరీ ప్రదేశాలు, వాహనాల పార్కింగ్ స్థలాలను నిశితంగా పరిశీలించారు. సీఐ శ్రీనివాస్, ఎస్త్స్ర మహేశ్ కు ఏసీపీ సదానందం పలు కీలక సూచనలు చేశారు.

కార్యక్రమం సజావుగా సాగేందుకు, ప్రజాప్రతినిధులకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కిసాన్ మేళా విజయవంతానికి, హాజరయ్యే వారందరి భద్రతకు పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.