6 July, 2026 | 3:04 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

04-06-2025 11:34 PM

తృటిలో ప్రాణాపాయం నుండి బయట పడిన వ్యక్తి..

నాగారం: నాగారం మండల(Nagaram Mandal) పరిధిలోని నాగారం బంగ్లా గ్రామ పంచాయతీలో వ్యవసాయ బావుల వద్ద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ను బుధవారం రిపేర్ కి తరలించే క్రమంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల విద్యుత్ షాక్ తగిలి కన్నెబోయిన విజయ్ కుమార్ అనే వ్యక్తి తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ప్రకారం... కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ శాఖ అధికారుల సమక్షంలో తొలగించి రిపేర్ పంపాల్సి ఉండగా అధికారులు తమకేం పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులే స్వయంగా ట్రాన్స్ఫార్మర్ ను రిపేర్ కు తరలించడానికి వెళ్ళారు. అధికారులు అన్నీ కలెక్షన్లు తొలగించినామని చెప్పడంతో ట్రాన్స్ఫర్ పైకి వ్యక్తి వెళ్లి కలెక్షన్లు రిమూవ్ చేస్తున్నారా ప్రమాదవశాత్తు విద్యుత్ తగిలి కింద పడి స్పృహ కోల్పోయాడు. పక్కనే ఉన్న రైతులు సమయస్ఫూర్తితో సిపిఆర్ చేయడంతో తిరిగి స్పృహలోకి వచ్చారు. వెంటనే క్షతగాత్రుని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.