17 July, 2026 | 1:09 AM

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... 11 మంది నక్సల్స్ మృతి

02-07-2024 06:17 PM

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 11 మంది నక్సల్స్ మృతి చెందారు. నారాయణపూర్ జిల్లా ధనంది - కుర్రేవాయ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు  జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో 11 మంది మావోయిస్టులు మరణించినట్లు ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్ లో డీఆర్ జీ మరియు బీఎస్ఎఫ్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి.