పిల్లల దవాఖానలో అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ, జూన్ 5 : దేశ రాజధా ని ఢిల్లీలో వరుస అగ్ని ప్రమాదాలు అందర్నీ కలవరపెడుతన్నాయి. గత నెలలో చోటుచేసుకున్న అగ్నిప్రమా ద ఘటన మరువక ముందే బుధవారం లజ్‌పత్ నగర్‌లోని పిల్లల ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలోని ఐ సెవెన్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 12 ఫైరింజన్లతో మంటలు ఆప్పారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో భవనం నుంచి నల్లటి పొగలు చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గత నెలలో ఢిల్లీలోని పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు మరణించారు. అగ్నిప్రమాదం జరిగిన డే కేర్ సెంటర్‌లో మొత్తం 19 మంది నవజాత శిశువులు చేరగా.. అందులో ఏడుగురు మరణించారు. మిగిలిన 12 మంది ని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేలింది.






