13 July, 2026 | 8:32 AM

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో భారీ మోసం

29-05-2024 02:11 PM

కొత్తగూడెం: సింగరేణి, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. నిరుద్యోగుల నుంచి నిందితులు రూ.4 కోట్లు వసూలు చేశారు. ఉద్యోగాలు కల్పించకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాసు హరీశన్, మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందితులను విచారిస్తున్నారు.