calender_icon.png 24 August, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా పాల్వంచలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

23-04-2025 10:32:16 PM

పాకిస్తాన్ దిష్టిబొమ్మ దహనం...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్థానిక దమ్మపేట సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సెంటర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మ తగలబెట్టారు. అనంతరం పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పాకిస్తానీ ఉగ్రవాదుల తూటాలకు బలైన భారతమాత ముద్దుబిడ్డలకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాము. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాము. టెర్రరిజం, టెర్రరిజానికి అండగా ఉన్న దేశం తప్పుకుంటా మూల్యం చెల్లిస్తుందన్నారు. 

370 ఆర్టికల్ రద్దు చేయబడిన తర్వాత ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ ఊపిరి పీల్చుకొని స్వేచ్ఛ స్వాతంత్రాలు పొంది, అభివృద్ధి జరుగుతుంది. కళ్ళుకుట్టి పాకిస్తాన్లో శాంతిభద్రతలు కాపాడుకోలేని ఆ ప్రభుత్వాలు భారతదేశంను అస్థిరపరచడానికి నీచమైన కుట్రలో భాగం ఈ దాడన్నారు. హిందువులా ముస్లింలా అని అడిగి ఏరుకోరి మన బిడ్డల్ని చంపారు. మన వారి రక్తాన్ని కళ్ళజోసిన వారి అంతమే మన కర్తవ్యమని, ప్రపంచ దేశాలు అన్ని భారత్ కు మద్దతు ప్రకటించాయి. టెర్రరిజం ఎక్కడున్నా అంతం చేయాల్సిందెన్నారు. 

మోడీ నాయకత్వంలో 11 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్నాం. టెర్రరిస్ట్ దాడులు లేకుండా, బాంబుల తుపాకుల మోతలు లేకుండా దేశం ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి దుర్మార్గమైన చర్యకు తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ పిరికిపందల చర్యను సంపూర్ణంగా ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, భట్టు నరేష్, మాదారపు లక్ష్మణ్, శాంపూరి నాగేంద్రబాబు, మాలోత్ ప్రశాంత్వి నయ్, పద్మ, నిల, మల్లికా, రాంబాబు, అశోక్, వినయ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.