calender_icon.png 22 January, 2026 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ స్టాల్‌కు భారీ స్పందన

19-09-2024 02:17:31 AM

పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థల ఆసక్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): గుజరాత్ గాంధీనగర్‌లో సెప్టెంబర్ 16 నుంచి బుధవారం వరకు జరిగిన ప్రపంచ నాలుగో పునరుద్ధరణీయ ఇంధన పెట్టుబడిదారుల సదస్సులో తెలంగాణ స్టాల్‌కు 300 మంది పెట్టుబడిదారులు, డెవలపర్స్ ఆకర్షితులయ్యారని ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, ఎండీ వావిళ్ల అనిలా పేర్కొన్నారు. సోలార్ విండ్, బయో ఎనర్జీ రంగాల్లో కీలక సుజలాన్, రిన్యూ సోలార్, జిందాల్ ఇండియా, అమర్ రాజా, గ్రీన్ ఎనర్జీ సంస్థలు తెలంగాణ కల్పిస్తున్న అవకాశా లపై ప్రత్యేక ఆసక్తి చూపినట్టు తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆమె చెప్పారు.