8 June, 2026 | 2:57 AM

పొతంగల్ చెరువు వద్ద భారీగా ఇసుక రవాణా

08-06-2026 01:33 AM
  1. పది రోజుల నుంచి ప్రతిరోజు టిప్పర్ల ద్వారా చెరువు మట్టి తరలింపు..
  2. అర్ధరాత్రి సుమారు 14 నుంచి 15 టిప్పర్లు మట్టి తరలింపునకు యత్నం..
  3. ఇరిగేషన్ ఏఈ రఫీ ఎస్‌ఐ సహకారంతో ఖాళీ టిప్పర్లను అడ్డుకున్న వైనం..

బాన్సువాడ, జూన్ 7 (విజయ క్రాంతి:) నిజామాబాద్ జిల్లా పొతంగల్ చెరువు నుంచి ప్రతి రోజు రాత్రిపూట అనగా అర్థరాత్రి నుంచి ఉదయం వరకు చెరువు మట్టి టిప్పర్ల ద్వారా నిబంధనకు విరుద్ధంగా రోజు తవ్వకాలు చేయడమే కాకుండా పాత పోతంగల్ గ్రామం నుంచి కొత్త పొతంగల్ గ్రామం మధ్యలో ఫ్లాట్లలో మట్టి అధిక రేట్లకు విక్రయాలు చేస్తూ భారీగానే దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత పది రోజుల నుంచి ప్రతిరోజు రాత్రి పూట మట్టి త్రవ్వకాలు జోరుగా చేస్తున్నారని విషయం తెలుసుకున్న ఇరిగేషన్ ఏ ఈ రఫీ సిబ్బంది నజీర్ను అక్కడ పంపించడం జరిగిందని తెలిపారు ప్రస్తుతం సుమారు 14 నుంచి 15 టిప్పర్లు ఖాళీగా ఉన్నాయని మట్టి నింపే ప్రయత్నం చేస్తుండగా అడ్డుకోవడం జరిగిందని ఆయన ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు,

విషయం గురించి కోటగిరి ఎస్‌ఐకి ఫోన్ చేస్తే సిబ్బందిని పంపిస్తున్నారని తెలపడం జరిగిందని వారు తెలపడం జరిగింది. గత పది రోజుల నుంచి అయితే ప్రస్తుతం అర్ధరాత్రి కాళీ టిప్పర్లు అదేవిధంగా మట్టి త్రవ్వకాలు చేస్తున్న జెసిబి ని ఫీజు చేస్తారా లేక వదిలి పెడతారా, శనివారం నాడు తిరుమల పూర్ గ్రామంలో జరిగిన ఓ సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మట్టి త్రవ్వకాలు రాత్రిపూట చేయరాదని టిప్పర్ల ద్వారా తరలించరాదని ఆదేశాలు కఠినంగా ఇచ్చారని అయినప్పటికీ వారి ఆదేశాలు బే ఖాతార్ చేసి రాత్రి పూట టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు ,తవ్వకాలు చేయడం ఏమిటని ప్రశ్నల వర్షం పలువురు కురిపిస్తున్నారు.

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారంగా జెసిబిల ద్వారా మట్టి త్రవ్వకాలు చేసి టిప్పర్ల ద్వారా అమ్ముకోవడం ఏమిటని , వాల్టా చట్టానికి తూట్లు పొడవడం ఏమిటని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అధికారులు అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులు వీటిపై చర్యలు తీసుకుంటారా వదిలి పెడతారా ఏది ఏమైనా నిబంధనకు విరుద్ధంగా గత కొద్దిరోజుల నుంచి ఇష్టానుసారంగా త్రవ్వకాలు చేస్తున్న ఈ వాహనాలపై తప్పనిసరిగా చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం గురించి ఇరిగేషన్ అధికారులతో పాటు అదేవిధంగా, కోటగిరి ఎస్‌ఐ తో పాటు హండ్రెడ్ కూడా డయల్ చేయడం జరిగింది, వారు కూడా సావధానంగా స్పందించడం జరిగింది.