8 June, 2026 | 2:56 AM

ముగిసిన సెయిలింగ్ పోటీలు

08-06-2026 01:33 AM

విజేతలకు పతకాలు అందజేసిన ప్రభుత్వ కార్యదర్శి కే రామకృష్ణారావు 

ముషీరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): హుస్సేన్ సాగర్‌లో నిర్వహించిన 17వ మాన్సూన్ రెగట్టా నేషనల్ ర్యాంకింగ్ సెయిలింగ్ చాంపియన్ షిప్ పోటీలు ముగిశాయి. ఆదివారం ముగింపు వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కె.రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ చీఫ్ కోచ్ సుహైమ్ షేక్‌తో కలసి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

అండర్--16 బాలుర విభాగంలో రవికుమార్ స్వర్ణం, వూట్ల నరసింహ రజతం, నీలకొండ మణి కాంస్యం, అండర్--16 బాలికల విభాగంలో రమీజా భాను స్వర్ణం, శృంగారి రాయ్ రజతం, సాక్షి కుమారి కాంస్యం, అండర్--18 మిక్డ్స్ డబుల్‌లో  బద్రీనాథ్ -నిరుడు- రిశ్విక జోడీకి స్వర్ణం, చంద్రలేఖ తత్తరి ధనుష్ జక్కులకు రజతం, శిరీష జల్లమ్మ- -రామ్‌చరణ్‌లకు కాంస్యం, స్కిఫ్ బాలుర విభాగంలో శరణ్య యాదవ్- శివం వాల్మీకి స్వర్ణం, వినోద్ దండు- అరవింద్ మలోత్ రజతం, మహమ్మద్ రిజ్వాన్ -ధోకి సాత్విక్ కాంస్యం, సింగిల్ హ్యాండర్ బాలుర విభాగంలో ప్రీత్ సివాల్ స్వర్ణం, హృదయ్ జైరామ్ జోషి రజతం, కౌనిక్ వర్ధన్ కాంస్యం, సింగిల్ హ్యాండర్ బాలికల విభాగంలో కాత్యాయని కౌశిక్ స్వర్ణం, కృతిక విశ్వనాథన్ రజతం, రమ్యశ్రీ చల్లా కాంస్య పతకాలు గెలుచుకున్నారు.