calender_icon.png 8 August, 2025 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ జర్నలిస్ట్ కాలనీలో భారీ చోరీ

07-08-2025 10:22:37 PM

రూ. రెండున్నర లక్షలు ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని దుండగులు

సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారులోని జర్నలిస్టు కాలనీలో గురువారం భారీ చోరీ జరిగినట్లు బాధితురాలు పట్లోల సుగుణ తెలిపారు. ఇంట్లో ఉన్న రెండున్నర లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని ఆమె తెలిపారు. గత శనివారం హైదరాబాద్ కు వెళ్లిన సుగుణ తిరిగి గురువారం ఇంటికి వచ్చి తాళం తీద్దామని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఇంట్లో పరిశీలించగా రెండున్నర లక్షలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఆమె తెలిపారు. ఈ సంఘటన గురించి బాన్సువాడ పట్టణ సిఐ అశోక్ కు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి చేరుకొని సిఐ అశోక్ చోరీ జరిగిన స్థలాన్ని పరిశీలించారు. చోరీ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అశోక్ తెలిపారు.