07-08-2025 10:25:00 PM
హన్మకొండ/కెయు క్యాంపస్ (విజయక్రాంతి): కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) వైస్ ఛాన్స్లర్ పేషీ సబర్డినేట్ మోతే సదానందం తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, వరంగల్ జేబీ కల్చర్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు కొరకు వరంగల్ పోతన విజ్ఞానపీఠంలో నిర్వహించిన సకల కలల సంబరాల జాతర- 2025 లో పాల్గొని గౌరవ ప్రశంసా పత్రాన్ని పొందిన సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య కే ప్రతాపరెడ్డి, రిజిస్టార్ ఆచార్య వి .రామచంద్రం అభినందించారు. ఉద్యోగులలో ఉన్న ఆసక్తి వారి పని ఉత్పాదికతలో మరింత పెరగడానికి దోహదపడుతుందని, వారిలో ఉన్న సృజన కళాత్మకత వారీ ఉద్యోగ విధులకు చాలా ఉపయోగపడుతుందని వైస్ ఛాన్సలర్ అన్నారు. పలువురు బోధన బోధనేతర సిబ్బంది పరిశోధకులు విద్యార్థులు మోతే సదానందం ను అభినందించారు.