19-06-2025 05:12:35 PM
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో భారీగా ఎస్సైలను బదిలీలు చేస్తూ గురువారం ఐజి సత్యనారాయణ(IG Satyanarayana) ఉత్తర్వులు జారీ చేశారు. హాలియా ఎస్సైగా పనిచేస్తున్న సతీష్ రెడ్డికి సీఐగా ప్రమోషన్ రావడంతో అదే ప్రాంతంలో హాలియా సీఐగా సతీష్ రెడ్డి నియమించారు. ఇక్కడ సీఐగా పని చేస్తున్న జనార్దన్ గౌడ్ ను ఐజి ఆఫీస్ కి అటాచ్ చేశారు. తిప్పర్తిలో పనిచేస్తున్న ఎస్సై సాయి ప్రశాంత్ హలియా ఎస్సైగా బదిలీ అయ్యారు. త్రిపురారంలో పని చేస్తున్న ఎస్సై ప్రసాద్ పెద్దవూరకి బదిలీ కాగా హుజుర్నగర్ లో పనిచేస్తున్న ఎస్సై ముత్తయ్య నాగార్జునసాగర్ కి బదిలీ చేశారు. మిర్యాలగూడ షీ టీమ్ లో పని చేస్తున్న ఎస్సై నరేష్ త్రిపురారంకి బదిలీ అయ్యారు. నాగార్జునసాగర్ ఎస్సై సంపత్ పెద్దవూర ఎస్సై వీరబాబులను నల్లగొండ విఆర్ కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.