calender_icon.png 23 December, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మాతంగి ప్రభాకర్ రావు

09-10-2024 04:06:35 PM

కోదాడ (విజయక్రాంతి): పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మాతంగి ప్రభాకర్ రావు హైదరాబాద్ లో జరిగిన 35వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మాతంగి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా మాతంగి ప్రభాకర్ రావు ప్రస్తుతం హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.