12-11-2025 01:18:05 AM
కెన్ ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా
ఆమనగల్లు, నవంబర్ 11 (విజయ క్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జేఏసీ చైర్మన్ శివలింగం, కెన్ ఆర్ సేవా దళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా కోరారు. మంగళవారం ఆమనగల్ పట్టణంలో ఆయన జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. కార్యక్రమంలోఎన్‌స్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి ఫరీద్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కరీమ్, సంచార జాతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసల పరమేష్,ఆమనగల్లు మండల ఉపాధ్యక్షులు సూదిని కొండల్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ.సీనియర్ నాయకులు కండె సాయి, పెయింటర్ సంఘం అధ్యక్షులు మహేష్, ఖలీమ్. ఇమ్రాన్,శీనులు పాల్గొన్నారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో..
ఇబ్రహీంపట్నం, నవంబర్ 11: మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. మంగళవారం అబుల్ కలాం 137 ఆజాద్ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని (కలెక్టరేట్) సమావేశ మందిరంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పాల్గొని అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలు పేరు ‘మొహియుద్దీన్ అహ్మద్‘, ’అబుల్ కలాం’ అనేది బిరుదు, ’ఆజాద్’ కలం పేరని అన్నారు.
ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించారని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్య్ర సమర ముఖ్య నాయకులలో ఒకడు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావిణ్యుడని తెలిపారు. దేశంలోని విద్యాభివృద్ధికి బాటలు వేసిన మొదటి దేశ విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కొనియాడారు. జర్నలిజంలో అపార అనుభవంతో ఉర్దూ పత్రికను నెలకొల్పి సమాజంలో నెలకొన్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషి చేశారని తెలిపారు. కేంద్ర విద్యాశాఖా మంత్రిగా పని చేసి విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకవచ్చారని, ఆజాద్ జయంతి రోజును జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.