calender_icon.png 11 November, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యారంగ అభివృద్ధికి మౌలానా అజాద్ కృషి

11-11-2025 02:00:53 AM

-ఆయన సేవలు చిరస్మరణీయం

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-నేడు మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి) : స్వతంత్ర భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. దేశ తొలి విద్యా శాఖ మంత్రి  మౌలానా అ బుల్ కలాం ఆజాద్ జయంతి (జాతీయ వి ద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం) సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆజాద్ చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

సెంట్రల్ అడ్వుజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చైర్మన్‌గా, వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, 14 సంవ త్సరాల్లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య, వృత్తి శిక్షణతో పాటు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటు వంటి విభి న్న విధానాలతో దేశంలో విద్యారంగ ఆభివృద్ధికి ఆజాద్ ఎంతగానో కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన జయంతి రోజును (నవంబర్ 11వ తేదీ) జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

మౌలానా ఆజాద్ స్పూర్తితో రాష్ర్ట ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ, నిరు పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేశా మని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులు, లెకర్చర్ల నియామకంతో రాష్ర్టంలో విద్యాభి వృద్దికి పాటుపడుతున్నామని సీఎం తెలిపా రు. జాతీయోద్యమంలో పాల్గొనడంతో పా టు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఆజాద్ ఎనలేని సేవలు అందించారని సీఎం కొనియాడారు. ఖినియాడారు ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారని, జాతీయోద్యమంలో హిందూ ముస్లిం ఐక్యతను కోరు కొని దేశ విభజనను వ్యతిరేకించారని గుర్తు చేసారు. ఆజాద్ జయంతిని మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. 

జూబ్లీహిల్స్‌లో గెలుస్తున్నాం..  మెజార్టీపైనే దృష్టి పెట్టండి

-మంత్రులంతా అందుబాటులో ఉండాలి

-పోలింగ్ శాతం పెంచేందుకు కృషి చేయాలి

-కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు.. బూత్ స్థాయిలో మానిటరింగ్ చేయండి

-సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం

-పోల్ మేనేజ్‌మెంట్‌పై సమావేశం

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారని, మెజార్టీ మీదే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నేతలతో అన్నారు. జూబ్లీహిల్స్‌లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని, దానిని పెంచేందుకు చర్యలు తీసుకో వాలని సూచించారు. పోల్ మేనేజ్ మెంట్ పై ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రతి ఓటరూ పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలన్నారు.

కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు బూత్ లెవల్ కమిటీలను మానిటరింగ్ చేయాలని సూచించారు. మంగళవారం పోలింగ్ ముగిసే వరకు మంత్రులంతా అందుబాటులో ఉండాలన్నారు. పోలింగ్ శాతం పెంపు, పార్టీ నేతలు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోల్ మేనేజ్ మెంట్‌పై సీఎం కీలక సూచనలు చేశారు. బీఆర్‌ఎస్, బీజేపీ విమర్శలను తిప్పికొట్టినట్లు తెలిసింది.  సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్‌లోని జూబ్లీహిల్స్ రిక్రి యేషన్ క్లబ్‌లో మంత్రులతో భేటీ అయ్యా రు.  సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇతర మం త్రులు పాల్గొన్నారు. పోల్ మేనేజ్ మెంట్‌పైనే ప్రధా నంగా చర్చించారు.